నిరూపిస్తే రాజీనామా చేస్తా: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

  • ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి తెలంగాణలో జరిగింది
  • వేరే రాష్ట్రంలో అంత అభివృద్ధి జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా
  • మేము ప్రజలనే నమ్ముకున్నాం
దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి తెలంగాణలో జరిగిందని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో గత ఏడేళ్లలో జరిగిన అభివృద్ధి ఇతర రాష్ట్రంలో కూడా ఎక్కడైనా ఉందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పారు.

 తాము ప్రజలనే నమ్ముకున్నామని అన్నారు. తమను గెలిపించాలన్నా, ఓడించాలన్నా అది కేవలం ప్రజల వల్లే సాధ్యమని... ఇతర పార్టీలు తమ గెలుపు, ఓటమిలను నిర్ధారించలేవని చెప్పారు. అసలు గెలుపు, ఓటముల గురించి మాట్లాడే హక్కు కేవలం ప్రజలకు మాత్రమే ఉందని అన్నారు. చేతిలో మైకు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ వినేవాళ్లు ఎవరూ లేరని చెప్పారు. విపక్ష పార్టీల నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు.

Pocharam Srinivas
TRS

More Telugu News